కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు తన సొంత డబ్బులతో లక్ష రూపాయలు వెచ్చించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. ఇటీవల పడ్డ వర్షాల కారణంగా కాట్రావులపల్లి పెట్రోల్ బంక్ వద్ద నుంచి హై స్కూల్, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా వెళ్లే సుమారు కిలోమీటర్ పైగా పెద్ద పెద్ద గోతులతో బురదమయంగా మారడంతో గ్రామ ప్రజల వాహనదారుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని ముసిరెడ్డి నాగేశ్వరరావు సేవా భావంతో సుమారు లక్ష రూపాయలు నిధులు వెచ్చించి మెటల్ వేయించి యంత్రాలతో రోడ్డుపై పెద్ద పెద్ద గోతులను పూడ్చేందుకు మరమ్మత్తు పనులు చేపట్టారు.దీంతో నాగేశ్వరరావు సేవలకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు..