కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి
కాకినాడ జిల్లా, జగ్గంపేట హైస్కూల్ సమీపంలోని శ్రీ సోమలమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా కుంకుమపూజ, పంచామృతాభిషేకం, మండపారాధన, దుర్గా హోమం కార్యక్రమాలను భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి దంపతులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ కార్యవర్గం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ శ్రీ సోమలమ్మ తల్లి అమ్మవారు జగ్గంపేట గ్రామదేవతల్లో పెద్ద అమ్మగా భక్తులను రక్షిస్తూ కోరికలు తీర్చే మహిమగల కల్పవల్లి అని తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశీస్సులతో ఆలయ నిర్మాణం జరిగిందని, గత ఎనిమిది సంవత్సరాలుగా ధర్మకర్తగా నేను లలిత బాబు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.