పాటంశెట్టి సూర్యచంద్ర
ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ గ్రామం సాధన కోసం ప్రతి ఇంటి వద్ద తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేసి మన వీధిలోకి వచ్చే పంచాయతీ రిక్షాలకు,ట్రాక్టర్లకు అందించే విధంగా తమ కుటుంబ సభ్యులందరినీ విద్యార్థులు చైతన్య పరచాలని కిర్లంపూడి మండలం తామరాడ హైస్కూల్ సమావేశంలో పాటంశెట్టి సూర్యచంద్ర విద్యార్థులందరినీ కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, పరిసరాలు పరిశుభ్రత పాటించకపోతే తీవ్ర అనారోగ్యాలతో ఆర్థికంగా వెనకపడతామని సూర్యచంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి ఒక్కరు స్వచ్ఛ గ్రామ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ప్రతి పరీక్షలోనూ దశల వారిగా అభివృద్ధి సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు.చిన్న మార్పుతోనే పెద్ద విజయాలు సాధ్యమని విద్యార్థులను పాటంశెట్టి సూర్యచంద్ర చైతన్యపరిచారు

