విశ్వంవాయిస్ న్యూస్, ఆత్మకూరు
2018 సంవత్సరంలో మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో గల కోకో కోల కంపెనీ వద్ద నిర్మాణస్యమైన ప్రదేశంలోబాధితురాలు మరియు తన స్నేహితుడు కలిసి మంగళగిరి నుండి పెదవడ్లపూడి గ్రామం వెళుతుండగా మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ ఆపి బాధితురాలిని తన స్నేహితుడును కొట్టి బాధితులని రేప్ చేసినట్లు బాధితురాలు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 215/2018U/sec 376 D, 506, 384 ఈ కేసును దర్యాప్తు చేసి ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసినారు. గుంటూరు జిల్లా 5వకోర్టు జడ్జి వారికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు పదివేల రూపాయలు జరిమానా విధించారు. మంగళగిరి మండల ప్రజలు ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన అట్టి కేసులలో ఇన్వాల్వ్ అయినా వారికి చట్ట ప్రకారం శిక్షలు విధించబడతాయని తెలియజేయడమైనది..