విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతర శ్రామికుడుగా, ఉద్యమకారుడిగా సమాజాన్ని జాగృతం చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి అని,ఆయన ఆశయాలు ఆదర్శనీయమని రాయవరం ఎం పి పి నౌడు వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన రాయవరం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో ఎంపీడీవో వంకాయల అరుణ ఆధ్వర్యం అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పిగా చారిత్రాత్మకుడయ్యారన్నారు. తొలుతగా వారు అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ, ఎంపీడీవో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ వి. వీరనారాయణ, సీనియర్ అసిస్టెంట్ కే. మల్లేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి ఏ గోవిందరాజులు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.