విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తొండంగి:
తొండంగి: ఏప్రిల్ 22: విశ్వం వాయిస్ న్యూస్:
అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్-104, కాకినాడ జిల్లా వారిచే వైద్య శిబిరం నిర్వహించబడింది.
155 మంది వైద్య సేవలను ఉపయోగించుకున్నారు.
గుండె సంబంధిత సమస్యలకు ECG పరీక్షలు.
పెరుమాళ్లాపురం కాకినాడ జిల్లాఅరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ 104″ విభాగం శుక్రవారం కాకినాడ సెజ్ లోని తొండంగి మండలం పెరుమాళ్లాపురం గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్ రోగుల సౌకర్యార్థం చింతకాయలపేట, పాత పెరుమాళ్లాపురం,కొత్త పెరుమాళ్లాపురం,బుచ్చయ్యపేట, హవల్దార్‌పాడు మరియు ఆవులమంద గ్రామాల ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించింది.
సుమారు 155 మందికి పైగా ప్రజలు వైద్య శిబిరానికి హాజరై, ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య బృందం మధుమేహం,రక్తపోటు, చర్మ సమస్యలు,కీళ్లనొప్పులు వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు.
ఇతర విద్యార్థినిలతో పాటు గ్రామంలోని పాఠశాలలు, కళాశాలల నుండి సుమారు 50 మంది విద్యార్దినులకు వైద్యుల బృందం రక్తహీనత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించి తగిన సూచనలను చేసారు.
వైద్య శిబిరానికి విచ్చేసిన శ్రీ కొయ్య మురళి( మార్కెట్ కమిటి చైర్మన్ తుని) మాట్లాడుతూ అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆసుపత్రి వారు అంకింత భావంతో అందిస్తున్న వైద్య సేవలకు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతల ప్రజలు కూడా వినియోగించుకోవడం సంతోషాదయకం అని తెలియచేస్తూ ఫౌండేషన్ కృషిని అభినందించారు.
ఈ సందర్భంగా అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్-104 (AEMS-104) కాకినాడ జిల్లా అధికారి వీరబాబు మాట్లాడుతూ ఈమెగా వైద్య శిబిరాన్ని పెరుమాళ్లాపురంలో విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.అలాగే ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని తయారు చేసేందుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి యాదాల ఉమరేవతి రాజబాబు,మాజీ సర్పంచ్ గంగిరి అడవియ్య మరియు ఇతర ప్రజా ప్రతినిధులకు కాకినాడ సెజ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలను సంస్థ ప్రతినిధులు తెలియచేసారు.