అమానుల్లా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జి మరియు ఏ పి రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీ జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా రాజమహేంద్రవరం పర్యటన లో ఉదయం నుంచి బిజీ బిజీ గా ఉన్నారు. ఈ సదర్భంలో శనివారం పలువురి తో భేటీ అయ్యారు. తొలుత కోర్టు ప్రాంగణం జస్టిస్ అషానుద్దిన్ అమానుల్లా మొక్కను నాటారు.. తదుపరి స్థానిక న్యాయ అధికారులు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి – జిల్లా న్యాయ సేవా ధికర సంస్థ – ఛైర్మన్ పి. వెంకట జ్యోతిర్మయి, సీనియర్ సివిల్ జడ్జి కం జడ్జి జిల్లా న్యాయ సేవ ధికార సంస్థ – సెక్రెటరీ కె.ప్రత్యుషకుమారి , రాష్ట్ర డిఎస్ఎల్ఏ కార్యదర్శి ఎమ్.బబిత, తదితరులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా జస్టిస్ ని కలిసిన వారిలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, కోనసీమ జిల్లా కలెక్టర్ హిమన్ష్ శుక్లా, ఎస్పీలు ఐశ్వర్యరాస్తోగి, వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్ లు ఇలాక్కియా, జీ. సూరజ్ ధనుంజయ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్లసుబ్బారావు, డిఆర్ఓ సత్తిబాబు, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, విద్యార్ధులు, తదితరులు కలిశారు. అనంతరం జిల్లా న్యాయ సేవా సంస్థ ప్రాంగణంలో ప్యానెల్ న్యాయవాదుల తో జరిగిన సమావేశం డి ఎల్ ఎస్ ఏ పరిధిలో చేపడుతున్న పలు అంశాలపై వివరాలు తెలుసుకుని , మరింత పారదర్శకంగా పౌర సేవలు అందించే దిశలో సామర్థ్యం పెంచేందుకు జస్టిస్ పలు సూచనలు చేశారు. ప్యారా లీగల్ వాలంటీర్లు డి ఎల్ ఎస్ ఎ కి కళ్ళు ,చెవులు గా గ్రామస్థాయి వరకు పనిచేయాలని పేర్కొన్నారు. మీ సేవా తత్పరతే ఎంతో కీలకం అని, మీరు లేకపోతే పరిస్థితి ఏమిటనే విధానంలో మీసేవలు ఉండాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు పి ఎల్ వి , పీ ఎల్ ఏ న్యాయవాదులకి ధ్రువ పత్రాలు అందజేశారు. జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా వారితో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలోని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇళ్ల శివ ప్రసాద్, ఉపాధ్యక్షులు టి. పాణిగ్రహి, కార్యదర్శి పి వి నాగరాజు, కోశాధికారి కే ఎన్ వి బాబు ఇతర సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.