విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:
రామచంద్రపురం, విశ్వం వాయిస్ః
ప్రజలకు అత్యవసర సమయంలో అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఆర్ ఎం పి వైద్యులను వైద్య విజ్ఞానంపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని, మారుతున్న కాలాన్ని బట్టి కొత్త వైద్య విధానంపై అనుభవ వైద్య నిపుణులనుండి కొత్త విషయాలను తెలుసుకుని అవగాహన ఏర్పరుచుకోవాలని రాష్ట్ర ఆర్ ఎం పి సంఘ అధ్యక్షులు డా. చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక డివిజన్ అధ్యక్షులు ఎన్ వి కృష్ణారావు అధ్యక్షతన డివిజన్ ఆర్ ఎం పి సభ్యుల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అయితే ముఖ్య అతిధిగా విచ్చేసిన డా. చప్పిడి
మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాణాలకు తెగించి సేవలు అందించిన ఆర్ ఎం పి సభ్యులను అభినందించారు. అలాగే మనకు తెలియని విషయాలను గూర్చి అనుభవ వైద్యులతో అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సభ్యులు అందరూ వినియోగించుకుని పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్ అధినేత డా. ఆనంద్ భాస్కర్ సభ్యులందరికి స్కానింగ్, వ్యాధి నిర్ధారణ పరీక్షల గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫెడరేషన్ ఉపాధ్యక్షులు కె.వి.వి సత్యనారాయణ, ఫెడరేషన్ ఈ సి సభ్యులు, కోశాధికారి దంగేటి చినబాబు,డివిజన్ కార్యదర్శి దేవానంద్, పి. వి. వి సత్యనారాయణ మరియు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.