విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:
అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్)
అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామ పంచాయతీ ఇన్ ఛార్జ్ కార్యదర్శిగా మంగళవారం జి.జి.వి.కె. కుమార్
బాధ్యతలు చేపట్టారు . సర్పంచ్ జల్లి బాలరాజు, పంచాయతీ సిబ్బంది ఇన్ ఛార్జ్ కార్యదర్శి కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈయన ఇటీవలే మాచవరం గ్రామపంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వర్తించారు.