విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
సమాజ హితానికి అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రముఖ విద్యాదాత, సామాజిక సేవా తత్పరులు యినపకోళ్ళ సత్యనారాయణ ( ఐఎస్ఎన్ ) అన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో కుల మత భేదాలు లేకుండా పేద మధ్య తరగతి ప్రజలందరికీ సహాయమందించే ఉద్దేశ్యం తో నూతనం గా నెలకొల్పిన అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ను ఐఎస్ఎన్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ ట్రస్టీ మహమ్మద్ అజం ఆధ్వర్యంలో 350 మందికి రంజాన్ రేషన్ కిట్లను ఐఎస్ఎన్ చేతులు మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ ఇబ్రహీం, ఎండి రహ్మాన్, షేక్ చిన్న బాదుల్లా, షేక్ చాందిని, ఎండి మౌలాలి, షేక్ బాషా ,బహదూర్ భాష ,ఎండి రబ్బాని తదితరులు పాల్గొన్నారు