Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పటిష్టత ప్రణాళికతో గృహ నిర్మాణం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

-జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులకు ఆదేశాలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

– జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు ఆదేశాలు

కాకినాడ, విశ్వం వాయిస్ః

జిల్లాలో పటిష్ట ప్రణాళికతో గృహ నిర్మాణాలను వేగవంతం చేయడంతోపాటు గృహ నిర్మాణ లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలలో పురోగతి చూపించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గురువారం యు.కొత్తపల్లి మండలం కొమరగిరి, నేమాం, స్థానిక గ్రామీణం తిమ్మాపురం లేఅవుట్ లలోని జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహ నిర్మాణాలను కలెక్టర్ కృతికా శుక్లా..హౌసింగ్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, సర్వే, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో గృహ నిర్మాణాలు పనితీరు పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి జిల్లాలో రెండు పెద్ద లేఅవుట్ లయిన యు.కొత్తపల్లి మండలం కొమరగిరి, నేమాం లేఅవుట్ లను సమన్వయ శాఖల అధికారులతో పరిశీలించడం జరిగిందన్నారు. ఈ రెండు లేఅవుట్ లలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు ఇసుక, సిమెంట్ ను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని, రాయితీతో స్టీల్ ను కూడా అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం మైక్రో ఫైనాన్స్, స్వయం సహాయక సంఘాల నుండి రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని తమ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఆప్షన్ మూడు కింద ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు కాంట్రాక్టర్లను ఎంపిక పూర్తయిందని తెలిపారు. అదేవిధంగా మే 5వ తేదీ వరకు జిల్లాలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ప్రభుత్వ ప్రాధాన్యత నిర్మాణాలైన గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఇంకా గ్రౌండింగ్ కానీ నిర్మాణాలకు గ్రౌండింగ్ మొదలుపెట్టడం, స్థల సేకరణ సమస్యలు పరిష్కరించి, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను నిర్ణయించి అన్ని నిర్మాణాలను గ్రౌండింగ్ చేయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్. నాగ నరసింహారావు, హౌసింగ్ పీడీ. బి.సుధాకర్ పట్నాయక్, ఈఈ ట్రాన్స్ కో ఎన్. ఉదయ భాస్కర్, యు కొత్తపల్లి మండలం ఎంపీడీవో వసంత మాధవి, గ్రామీణ మండలం తహసీల్దార్ మురార్జీ, ఎంపీడీవో పి.నారాయణ మూర్తి, హౌసింగ్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్, సర్వే ఇంజనీర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement