Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,466,078
Total recovered
Updated on September 27, 2023 2:43 AM

ACTIVE

India
557
Total active cases
Updated on September 27, 2023 2:43 AM

DEATHS

India
531,930
Total deaths
Updated on September 27, 2023 2:43 AM

భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజిపేట:

 

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

మండలంలో అసంపూర్ణంగా ఉన్న భవనాలను త్వరగా పూర్తి చేయాలని పి . గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందరికీ అందేలా చూడాలన్నారు. అంతేకాకుండా మండలంలో అన్ని భవనాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు
తరపట్ల మోహన్ సింగ్ బాబురావు సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకి వివరించి వినతిపత్రం సమర్పించారు. పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థుల కోసం బస్సులు రావడం లేదని చాలా సేపు బస్టాండ్లో నిరీక్షిస్తున్నారని
పుల్లేటికుర్రు సర్పంచ్ జల్లి బాలరాజు అన్నారు. అమలాపురం ఆర్టీసీ డిఎం సత్య సానుకూలంగా స్పందించి నిర్ణీత సమయంలో ఆర్టీసీ బస్సులు నడుపుతామని అన్నారు. వేళాపాళా లేకుండా కరెంటు కోతలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని అసలే పరీక్షల సమయం కరెంటు కోతలతో విద్యార్థిని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఎంపిటిసిలు సర్పంచ్లు ఎలక్ట్రికల్ ఏఈ సురేష్ వద్ద వాపోయారు . త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఏ ఈ సురేష్ తెలిపారు. అంబాజీపేట మండలనని కొత్తపేట డివిజన్లో కలపకుండా అమలాపురం డివిజన్ లో కలపాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం పి డి ఓ వి. శాంతా మని, జడ్పిటిసి బూడిద వరలక్ష్మి, ఎమ్మార్వో ఎల్ జోసఫ్ , వైస్ ఎంపీపీ నేతలు నాగరాజు, ఎంపీటీసీ సమాఖ్య అధ్యక్షులు ముత్తబత్తుల ప్రశాంత్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు ,అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!