విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
అమలాపురం రూరల్ మండలం వన్నేచింతలపూడి గ్రామ పరిధిలో సత్తి షణ్ముఖ సత్య సాయి సాకేత్ 7 సంవత్సరాలు బాలుడుతన తోటి పిల్లలతో ఆడుకుంటూ బుధవారం ఉదయం తన ఇంటి ఎదురుగా ఉన్న ప్రధాన పంట కాలువ లోకి ప్రమాదవశాత్తు కాలువలో కాలుజారి పడిపోవడం తల్లిదండ్రులు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా అక్కడ వాతావరణం నెలకొంది.అక్కడే ఉన్న కొంతమంది వెంటనే కలువలోకి దూకి బాలుడు ను రక్షించే ప్రయత్నం చేసిన సరే కాలువలో నీరు అతి ఎక్కువగా ఉండటం తో బాలుడు నీటిలో మునిగిపోవడం జరిగింది. అక్కడ ఉన్న గ్రామస్తులు యూవత కలువలోకి దిగి గాలింపు చర్యలు చెప్పటారు. అధికారులు కి సమాచారం ఇవ్వడంతో అమలాపురం నుండి గాలింపు బృందాలు అక్కడ కి చేరుకుని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.సుమారు ఉదయం పదకొండు గంటలు సమయంలో బాలుడు ఆచూకీ దొరికింది.వెంటనే అమలాపురం హాస్పిటల్ కి తరలించారు.అప్పటికే ఆ అబ్బాయి చానిపోయాడు అని నిర్దారణ చేయడంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీళ్లు తో కోలుకోలేని పరిస్థితి గా మారింది.వన్నె చింతలపూడి, సవరపాలెం ,సమనస గ్రామాల్లో శోకసంద్రం చోటు చేసుకుంది. కాలువ నీరు ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఏప్రిల్ నెలలోనే మొత్తం నీరు లేకుండా కాలువ కట్టేసేవారని అసలు మే నెలలో ఇంత నీరు ఉంచడంకి గల కారణాలు తెలియజేయాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలుడు కలువ లో కాలు జారీ పడిపోయాడు అని తెలిసినా వెంటనే అమలాపురం రూరల్ ఎస్ ఐ పరదేశి అక్కడకు చేరుకుని కలువలోకి గాలింపు చర్యలు వేగవంతం చేశారు.అమలాపురం డి.ఎస్పీ వై.మాధవ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటన పై అరా తీశారు.బాలుడుచనిపోయన్నట్టు ఇచ్చిన రిపోర్టు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అమలాపురం తాలూకా ఎస్.ఐ పరదేశి తెలిపారు.