దేవాలయానికి లక్ష రూ… ఇచ్చిన మంత్రి దాడిశెట్టి రాజా"
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తొండంగి:
తొండంగి: మే 8: విశ్వం వాయిస్ న్యూస్:
కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలోగల పెరుమాళ్ళపురం గ్రామ పంచాయితీ,పెరుమాళ్ళ పురం గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కాశీ అమ్మవారి (దుర్గమ్మ) దేవాలయంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా విచ్చేయడం జరిగింది. కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.కాశీ అమ్మవారి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టించినందుకు అమ్మవారి పేరున మంత్రి దాడిశెట్టి రాజా ఆయన లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది.అదేవిధంగా అదే పంచాయతీ పరిధిలో ఉన్న ఆవులమంద గ్రామంలో జరుగుచున్న సీతారామ కళ్యాణం మంత్రి దాడిశెట్టి రాజా సీతారామ కళ్యాణం కార్యక్రమంలో పాల్గొనం జరిగింది.తరువాత భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొయ్య మురళీకృష్ణ,మండలం ఎంపీపీ అంగులూరి అరుణ్ కుమార్,వైస్ ఎంపీపీ నాగం గంగ బాబు, వైస్ ఎంపీపీ యాదాల రమణ కృష్ణ, స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ యాదాలరాజు, ఎక్స్ సర్పంచ్ గంగి రి అడవియ్యా, మండలంలో ఉన్న ఎంపిటిసిలు, మండల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.