పడుతున్నామ్. కాలేరు గ్రామీణ ఉపాధి కూలీలు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )కాలేరు గ్రామంలో ముమ్మరంగా గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపట్టారు. కాలేరు గ్రామ శివారు సుభద్రపురం చెఱువు పూడిక తీత పనులు 125 మంది కూలీలు చేస్తున్నారని ఆ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ కొత్తపల్లి క్రాంతి కుమార్ తెలిపారు. అలాగే మరో 60 మంది కూలీలు కాలువ పూడిక తీత పనులు చేపట్టారు అన్నారు. ఇటీవలి అసని తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు కు ఉపాధి హామీ పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. రెండూ పూటలా ఉపాధి హామీ పథకం పనులు చెయ్యాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని కూలీలు వాపోతున్నారు. రెండవ పూట వ్యవసాయం పనులు, పశువుల పెంపకం వంటి పనులు చేసుకుంటామన్నారు. ఉదయం 12 వరకూ పనిచేసి ఇంటి వద్ద వంట పనులు చేసుకొని మరల మధ్యాహ్నం పనికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నామని మహిళా కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. గతం లో లాగే ఒక పూట పనే చేయించాలని ఉపాధి కూలీలు ప్రభుత్వాన్ని కోరుచున్నారు.