కోనసీమ కలెక్టర్
– నేరుగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొనున్న
అధికారులు
– ప్రజల సమస్యలు కలెక్టర్ నేరుగా విన్నవించుకోవచ్చు
అర్జీదారుల సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు
– రెవెన్యూ డివిజనల్ కార్యాలయము నందు నెలకొకసారి
స్పందన
ప్రజల సమస్యలను పత్రికా ముఖంగా తెలియ జేసిన
విశ్వం వాయిస్ దినపత్రిక
– విశ్వం వాయిస్ ఎడిటర్ ను అభినందిస్తున్న ప్రజలు,
అధికారులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ః
ప్రభుత్వానికి, ప్రజలకు అను సంధంగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం మీడియా సమాజం లో ప్రత్యేక మైన పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం స్పందన కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జిల్లాల విభజనలో భాగంగా కొన్ని మండలాలు, గ్రామాలు జిల్లాల విభజనతో రూపు రేకలేను మార్చుకున్నాయి. అలా మార్చడంతో జిల్లా కేంద్రం, డివిజన్ కేంద్రానికి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం స్పందన కార్యక్రమానికి వెళ్ళాలి. ఈ నేపథ్యంలో రవాణా మార్గాలు అర్జీదారులకు వెళ్ళడానికి అనుకూలంగా లేవు. డివిజన్ కేంద్రానికి వెళ్ళడానికి బస్సుల ప్రయాణించే అస్కరం లేక పోయింది. ప్రభుత్వం బస్లు ఏర్పాటు చెయ్యలేక పోయింది. కొన్ని ప్రాంతాల్లో గోదావరి నది దాటి వారి సమస్యలు చెప్పుకోవడం కోసం నా నా ఇబ్బందులు ఎదుర్కొంటుంన్న పరిస్థితి. ఆటువంటి సమయంలో విశ్వం వాయిస్ దిన పత్రికలో స్పందనకు వెళ్లాలంటే…””రవాణా నిల్..సమస్యలు ఫుల్ “” అనే కథనం ప్రచురించింది ఈ కధనానికి కలెక్టర్ స్పందించారు.
*పత్రికా కథనానికి విశ్లేష స్పందన*
ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పత్రికలు, మీడియా ద్వారానే సమాచారం అందించడం జరుగుతుంది. పత్రికల ద్వారా ప్రజ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం తద్వారా సమస్య పరిష్కారించ బడుతున్నాయి. ఆదివారం న విశ్వం వాయిస్ దినపత్రికలో వచ్చిన కథనంతో కలెక్టర్ స్పందించి నేడు స్పందన కార్యక్రమం రామచంద్రపురం, రెవిన్యూ డివిజనల్ కార్యాలయము నందు ఉదయం 10.00 గంటలు నుండి నిర్వహించారు . ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమన్శ్ సుక్లా, అర్జీ దారులు నుండి అర్జీలు స్వీకరించారు. సోమవారం స్పందన కు మొత్తం 24 అర్జీలు రాగా వాటిలో రెవెన్యూ 13, హౌసింగ్ నిమిత్తం 3, భూ బదలాయింపు 1, వెబ్లాన్ద్ 1, ఎంక్రోచ్మెంట్ 1, రేషన్ కార్డ్ 1,
తరములు 4 వచ్చినట్లు తెలిపారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట సమయంలో అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమం నెలలో ఒక వారం రామచంద్రపురం డివిజన్లో నిర్వహించడం జరుగుతుందని పత్రికా ముఖంగా తెలిపారు. పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
ప్రజల సమస్యలు నేరుగా అధికారులకు తెలియ జేయగల పత్రికలు ఎన్నో వున్నాయి. అందులో భాగంగా విశ్వం వాయిస్ లో వచ్చిన కథనం ద్వారా ఒక మంచి పని నేడు కోనసీమ జిల్లాలో జరుగుతున్నదని ఆయన అన్నారు. ప్రజల గోడు ను పత్రిక ద్వారా తెలియ పర్చి నేడు స్పందన కార్యక్రమం నిర్వహించడానికి పత్రిక యాజమాన్యం పూనుకుంది. ఆ యాజమాన్యానికి ప్రజ అభినందనలతో పాటు అదికారుల అండదండలు మెండుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమములో రెవెన్యూ డివిజనల్ అధికారి పి.సింధు,
సుబ్రహ్మణ్యం , తదితరులు
పాల్గొన్నారు.