Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మండపేట పట్టణంలో డ్రైన్ సీల్డ్ తొలగించే పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నుకాదుర్గ రాణీ.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

మండపేట అర్బన్ (విశ్వం వాయిస్)

మేజర్ & మైనర్ డ్రైన్లు వార్షిక పూడికతీత పనులలో భాగంగా స్థానిక 24,26,27,28వ వార్డుల పరిధిలో ఉన్న రామచంద్రుడు డెడికేటెడ్ ఛానల్ నందు జరుగుతున్న పూడికతీత పనులను వార్డు కౌన్సిలర్లు శ్రీమతి జొన్నపల్లి విజయలక్ష్మి సత్తిబాబు,అమలదాసు లక్ష్మీ,మొండి భవాని మురళి, వైస్సార్సీపీ నాయకులు అధికారి శ్రీనివాస్ లతో కలసి శుక్రవారం మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకదుర్గా రాణి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాణి మాట్లాడుతూ రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ పూడికతీత పనులను వేగవంతం చెయ్యాలని, డ్రైన్ల నుండి వచ్చిన మట్టిని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ను ఆదేశించారు. తమ వంతు బాధ్యతగా డ్రైన్లలో చెత్త వేయకుండా త్రిబుల్ డస్ట్ బిన్స్ ను వాడాలని తద్వారా డ్రైన్ బ్లాకేజ్ ను అరికట్టవచ్చునని అన్నారు. అనంతరం 24వ వార్డులో ఉన్న పంట కాలువ ను పరిశీలించి పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించమని శానిటేషన్ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో శానిటరీ మెస్త్రీలు మహేష్ ,వెంకట్రావు, సానిటరీ సెక్రెటరీ లు రామకృష్ణ ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement