– ఎటపాకలో ఘనంగా పాల్ రాజ్ 11వ వర్ధంతి వేడుకలు
– సతీష్ పాల్ రాజ్ పేరుతో నూతన బస్టాప్ ప్రారంభం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
డా.పాల్ రాజ్ ఇంజినీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు , వేమూరు మాజీ ఎమ్మెల్యే రెవ.డా.సతీష్ పాల్ రాజ్ సేవలు చిరస్మణీయమని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య , ఎటపాక జెడ్పీటిసి ఉబ్బా సుస్మిత కొనియాడారు. ఎటపాక మండల కేంద్రంలో డా రెవ.ఎస్.పాల్ రాజ్ నూతన బస్ స్టాప్ ను సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య , ఎటపాక జెడ్పీటిసి ఉబ్బా సుస్మిత చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం డా.పాల్ రాజ్ ఇంజినీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు , మాజీ ఎమ్మెల్యే , రెవ.డా.పాల్ రాజ్ 11వ వర్ధంతి వేడుకలు ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఎటపాకలో ఏండ్లు గడుస్తున్నా బస్ స్టాప్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎటపాక జెడ్పీటిసి ఉబ్బా సుస్మిత ప్రోద్భలంతో డా.పాల్ రాజ్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ వరలక్ష్మి , కళాశాల సెక్రటరీ జకరయ్య సహకారంతో ఎటపాక మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కన నూతన మినీ బస్ స్టాప్ నిర్మించి ప్రారంభించారు. అనంతరం డా.పాల్ రాజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెవ.డా.పాల్ రాజ్ విగ్రహానికి కళాశాల చైర్మన్ వరలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కళాశాల చైర్మన్ వరలక్ష్మి , కళాశాల సెక్రటరీ జకరయ్య మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు , గిరిజనేతర విద్యార్ధులకు సాంకేతిక విద్యను అందించిన ఘనత ఒక్క డా.పాల్ రాజుకే సాధ్యమైందన్నారు. ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిలో దేశ విదేశాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. అలాగే గుడ్ సమారిటన్ ఈవాంజిలికల్ లూధరన్ చర్చ్ , బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ, అలీనా ఎడ్యుకేషనల్ సోసైటీ ఇంకా మరెన్నో సంస్థలు స్థాపించిన ఘనత ఒక్క డా.పాల్ రాజుకే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉబ్బా సత్యం , కళాశాల వైస్ చైర్మన్ శ్యామల , కరస్పాండెంట్ రాజశేఖర్ , ప్రిన్సిపాల్ డా.రాజేష్ , వైస్ ప్రిన్సిపాల్ హాథిరామ్ , లైజన్ ఆఫీసర్ శ్రీనివాసరాజు , కళాశాల సిబ్బంది , కళాశాల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.