వాహనం
– స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :
మండలం పరిధిలోని వెంకటరెడ్డిపేట మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపుతప్పి కరెంట్ పోల్ ను ఢీ కొట్టి జాతీయ రహదారి పక్కకు టెంపో ట్రావెలర్ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కరెంటు పోల్ విరిగి పడిపోయింది. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ టెంపో ట్రావెలర్ వాహనంలో వున్న ప్రయాణికులు రాజమండ్రి నుండి భద్రాచలం రాముల వారి దర్శనానికి వస్తున్నట్టు సమాచారం.