విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తుని:
తుని: మే5: విశ్వం వాయిస్ న్యూస్:
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలు మేరకు తుని టీడీపీ ఇంచార్జి యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో తుని పట్టణంలో జగనన్న బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది.
భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు హాజరై తుని పట్టణంలో విధి వీధికి ప్లేకార్డ్స్,కరపత్రాలు పట్టుకుని ప్రజలకు విసినికర్రలు పంచుతూ
జగన్ పోవాలి — చంద్రబాబు
రావాలి
జగన్ పోవాలి — చంద్రబాబు రావాలని
ఒక్క ఛాన్సుకే — గోవిందా
జగన్ పాలన — గోవిందా
తుగ్లక్ పాలన — గోవిందా
రాష్ట్ర భవిష్యత్ — గోవిందా
అని నినాదాలు చేశారు.
అనంతరం కృష్ణుడు మాట్లాడుతూ
నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోయారు. ఉప్పులు, పప్పులు,నూనెలు ,పెట్రోలు, గ్యాస్ ధరలు, బస్సు ఛార్జీలు, విద్యత్ చార్జీలు గతంలో ఎన్నడూ లేనివిధంగా రెట్టింపు అయ్యాయి.
ఇంటి పన్ను,చెత్త పన్నులు వేస్తూ తుగ్లక్ పాలన్ చేస్తున్నాడు.
90శాతం హామీలు అమలు చేసాను అని గొప్పగా చెపుతున్న ఈ ప్రభుత్వం 45 సంవత్సరాలకే పించను హామీఏమైందన్నారు.
అన్ని పథకాలలో కోతలు కోసాడు.
రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు,అక్రమాలతో ప్రభుత్వ పాలన నడుస్తుంది.
రాష్ట్రంలో నాటుసారా, కల్తీ సారా ఏరులై పారుతున్నా. ప్రభుత్వం అరికట్టడం లేదు.
రైతులకు గిట్టుబాటు ధరలు లేవు,
యువతకి ఉద్యోగాలు లేవు,
రాష్ట్రంలో పెట్టుబడులు లేవు,
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో మనందరం చూస్తున్నాం.
సంక్షేమ పథకాలు పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కురుకుపోయేలా చేశారు.
రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని, రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరి మీద ఉందని తెలియచేసారు..
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొల్నాటి శేషగిరిరావు,కాకినాడ పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు సుర్ల లోవరాజు,కాకినాడ పార్లమెంట్ తెలుగు యువత అద్యక్షులు యనమల శివరామకృష్ణన్, తుని టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ యినుగంటి సత్యనారాయణ,తుని మండల టీడీపీ ప్రెసిడెంట్ అప్పన రమేష్, తొండంగి మండల టీడీపీ ప్రెసిడెంట్ కోడా వెంకటరమణ, కోటనందురు మండల టీడీపీ ప్రెసిడెంట్ గాడి రాజుబాబు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్సులు,అనుబంధ కమిటీ నాయకులు,నియోజకవర్గ, మండల బీసీ,రైతు,ఎస్సి,మైనార్టీ, మహిళా సెల్ నాయకులు,మాజీ ప్రెసిడెంట్లు, మాజీ వార్డు కౌన్సిలర్లు, యువత బారి ఎత్తున హాజరయ్యారు.