Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మొక్కలు నాటే యంత్రం… తూతూ మంత్రం…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖార్
– ముఖం చాటేసిన వీఆర్వోలు, బీఎల్వోలు
– ఆదివారం ఐతే ఉత్తర్వులు పాటించరా…?

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:

 

శంఖవరం, జూన్ 5, (విశ్వం వాయిస్ న్యూస్) ;

జూన్‌ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాదితో దీనికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈసారి ‘ ఓన్లీ వన్‌ ఎర్త్‌ ’ థీమ్‌తో ఐక్యరాజ్య సమితి ముందుకు వచ్చింది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ప్రయత్నించాలని, గ్రీన్‌ లైఫ్‌ స్టైల్‌ను అలవర్చు కోవడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతల కోసం చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపును ఇచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపధ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కూడా జిల్లాలోని అన్ని తాహసిల్దార్ కార్యాలయాలకు కూడా ఉత్తర్వులను జారీ చేసారు. ఈ ఉత్తర్వులు అందరు వీఆర్వోలకు అందేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఆలస్యంగా వీఆర్వోలకు ఉత్తర్వులు అందడం, స్థానికంగా సామాజిక అటవీ వనాల్లో ఎక్కడికక్కడ మొక్కలు అందుబాటులో లేకపోడం, దూరం నుంచి మొక్కలను కొని తెచ్చుకొని దూరాభారం, వ్యయ ప్రయాస కావడంతో మొక్కలను నాటే కార్యక్రమం ఆశించిన స్థాయిలో కాకుండా అరకొరగా జరిగింది. మొక్కలను నాటే తంత్రం కాస్తా శంఖవరం మండలంలోని 14 పంచాయితీలు, 16 సచివాలయాల పరిధిలో 15 మంది వీఆర్వోలు, 131 నుంచి 179 వరకూ 49 పోలింగ్ కేంద్రాలు, వాటికి 49 మంది బూత్ లెవల్ అధికారులూ ఉన్నారు. ఇంత మంది ఉన్నా కొన్ని గ్రామాల్లో మొక్కలు నాటే ఈ మంచి కార్యక్రమం తూతూ మంత్రంగా సాగింది. కొన్ని పంచాయితీల్లో మాత్రం సజావుగా సాగింది. ఈ మొక్కలను నాటించే బాధ్యత మండలంలో 15 మంది వీఆర్వోలు, 49 మంది ఎన్నికల బూత్ లెవెల్ అధికారుల మీద ఆధారపడి ఉంది. ఈ నేపధ్యంలో వజ్రకూటం పంచాయితీలో ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కో మొక్కను స్థానిక వీఆర్వో దేవసహాయం నేతృత్వంలో, కత్తిపూడిలో వీఆర్వో యు.శ్రీనివాస్ స్వయంగా తేటగుంట నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలను కొని తెచ్చుకుని ఆయన నేతృత్వంలో స్థానిక సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం ప్రాంగణంలో మొక్కలను నాటారు. అన్నవరంలోనూ, నెల్లిపూడిలోనూ మరికొన్ని పంచాయితీల్లోనూ ఎన్నికల బూత్ లెవల్ అధికారుల సమన్వయంతో మొక్కలను నాటారు. మరికొన్ని గ్రామాల్లో అయితే అసలు మొక్కలను నాట లేదు. ఈ కార్యక్రమానికి కొందరు వీఆర్వోలు, బిఎల్వోలూ ముఖం చాటేసారు. ఆదివారం సెలవు దినం ఐతే ప్రభుత్వ ఉత్తర్వులను పాటించరా అన్న ప్రశ్న లేవనెత్తడానికి తావిచ్చారు. కత్తిపూడి సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, ఉప సర్పంచ్ గౌతు సుబ్రహ్మణ్యం, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు గాబు కృష్ణ, వజ్రకూటం సరపంచ్ సకురు గుర్రాజు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement