Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** ఇచ్చిన మాట””” తప్పొదు…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ప్రతి ఒక్కరికి ఆర్&ఆర్ ఇచ్చి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
– సి.పి.యం జిల్లానాయకులు పూనెం. సత్యనారాయణ
– గత గత భూములకు ఎకరానికి రూ.5 లక్షలు ఇవ్వాల్సిందే.
– రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులను పూర్తి స్థాయిలో
అన్యాయం చేస్తుందని ఆరోపణ.
– అసైన్డ్ భూములకు రూ.10 లక్షల 80 వేలు
అందించాలి.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:

 

వి. అర్.పురం ( విశ్వం వాయిస్ న్యూస్)

05;- ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిర్వాసితులకు ఒకమాట చెప్పి నేడు అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులను పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తూ ఇచ్చిన మాట తప్పుతుందని,తక్షణమే పూర్తీగా ఆర్&ఆర్ అర్హులందరికీ ఇచ్చి , నిర్వాసితులు కోరుకున్న చోట పునరావాసం కల్పించాలని సిపియం పార్టీ జిల్లా నాయకులు పూనెం.సత్యనారాయణ

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మండల పరిధిలోని చొక్కన పల్లి గ్రామంలో ఆదివారం సి .పి.యం జనరల్ బాడీ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు పూనెం.సత్యనారాయణ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఏళ్ళు గడుస్తున్నప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ , కేంద్రం ద్వారా వస్తున్న నిధులను పక్కతోవ పట్టిస్తూ ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అదే విధంగా నిర్వాసితుల రైతులకు చెల్లించాం వలసిన భూ నష్ట పరిహారం చెల్లించకుండ, తత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పను, మడిమ తిప్పను, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని అన్నారని, కానీ నిర్వాసితుల విషయంలో మాట తప్పుతున్నారని అందుకు చాలా ఉదహరణలున్నాయని పూనేం అన్నారు. గతంలో తక్కువ పరిహారం పొందిన భూములకు నేను అధికారంలోకి రాగానే ఎకరానికి రూ. 5 లక్షలు ఇస్తానని అన్నారని, నేటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సారాల కాలం దాటినా నేటికి ఆ ఊసే లేదని ఆరోపించారు. అదే విధంగా నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఇక్కడ నుండి తరలించే ముందు పది లక్షల అర్ అండ్ అర్ సొమ్ములు ఇస్తానని అన్నారని కానీ నేటికీ ఒక్క ఇల్లును కూడా తరలించక ముందే కొన్ని గ్రామాల్లో కొంత మందికి మాత్రమే రూ. 6 లక్షల 80 వేలు, పచ్చిమ గోదావరి లో పునరావాసం కల్పించిన యస్సిలకు రూ. 8 లక్షల 56 వేలు ఇచ్చారని, కానీ పూర్తి స్థాయిలో రూ. 10 లక్షలు ఇవ్వక పోవడం దురదృష్టకరమని , పదిలక్షల చెల్లిస్తామన్న మాట ఏమైనదని ప్రశ్నించారు. నేటికి ముంపు నాలుగు మండలాల్లో ఉన్న నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణం నేటికి పూర్తి కాక పోవడం సిగ్గు చేటని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ జూన్, జులై, ఆగస్టు నెలలో మళ్ళీ బ్యాక్ వాటర్ వస్తే మళ్ళీ గోదావరిలో మునగాలా అని పూనేం అన్నారు. గ్రామాల్లో ఇర్వాసితులకు అరకొరగానే అర్ అండ్ అర్ కొద్ది మొత్తంలో చెల్లించి చేతులు దులుపుకున్నారని, మిగతావారికి వస్తాయో..రావో కూడా అర్ధం కాక ఆందోళనలో నిర్వాసితులున్నారని ఆరోపించారు.

 

* అసైన్డ్ భూములకు రూ. 10 లక్షల 80 వేలు ఇవ్వాలి.

,ఆదివాసీలు సాగుచేస్తున్న అసైన్డ్ భూములకు పశ్చిమగోదావరి జిల్లాలో 10 లక్షల 80 వేలు ఎకరాకు ఇచ్చి ఈ నాలుగు మండలాల్లో 1.90 వేలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని పూనేం ప్రశ్నించారు.ఇంకా కొన్ని అసైన్డ్ భూములు సర్వేకూడా నిర్వహించలేదని,ఎప్పుడు నష్టపరిహారం చెల్లిస్తారో చెప్పాలని కోరారు.నిర్వాసితుల సమస్యలు పరిష్కరిచటంలో నియోజకవర్గ ఎమ్మేల్యే,ఎం.పి లు పూర్తీగా విఫలం అయ్యారని విమర్శించారు. భవిష్యత్ లో నిర్వాసితుల సమస్యలపై ఆందోళనలను సి.పి.యం నిర్వాసితులకు అండగా తప్పకుండా చేస్తుందని తెలిపారు.

ఈ సమావేశానికి తోడం.రాజు అధ్యక్షత వహించగా పార్టీ మండల కార్యదర్శి సోయం.చినబాబు,నాయకులు పంకు.సత్తిబాబు,పులి.సంతోష్ కుమార్,కమ్మచిచ్చు.సత్యనారాయణ,గొంది.దరయ్య,పులి.ధర్మరాజు,తాతబాబు,సున్నం.సీతమ్మ,తోడం.చిన్నబూబమ్మ ,గలిదేవుడు,రాములమ్మ,తోడం.సారయ్య,సోడి.శ్రీను,సీతారముడు,పోసిబాబు,అనిల్,సతీష్,వెంకటేష్,అమరావతి,వెంకటలక్ష్మి,వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement