విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:
విశ్వం వాయిస్ ఐ.పోలవరం
ఐ పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలోని సాయిరాం విద్యా నికేతన్ హైస్కూల్ విద్యార్థులు ఈ ఏడాది నిర్వహించిన 10వ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కన పరిచారని స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు 30 మంది విద్యార్థులు హాజరు కాగా 100% ఉత్తీర్ణత సాధించారన్నారు. అందులో 16 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే పడాల షష్టికా వెంకట సాయి శ్రీ, 567/600, పట్టా నిస్సీ 550 మార్కులు, బద్రి అమృత వీర వేణి 540 మార్కులు, మందపాటి సాయినీల 538 మార్కులు, బొండా శ్రీ గౌరీ ఐశ్వర్య భారతి 531మార్కులు, మదింశెట్టి సాయి మానస 529 మార్కులు, విశ్వనాధపల్లి కృపా థెరిసా 528 మార్కులు సాధించారని తెలిపారు. ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. విద్యార్థులకు ఇంకా మెరుగైన విద్యను అందించడం కోసం వరల్డ్ క్లాస్ కరిక్యులం అయినా లీడ్ స్కూల్ ప్రోగ్రాం ని సాయిరాం విద్యానికేతన్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి , మ్యాథ్స్ ,సైన్స్ లలో కాన్సెప్ట్స్ తో బోధన ఉంటుంది,ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పాఠ్యాంశాలు ఉంటాయి .దీనిలో భాగంగా అన్ని క్లాస్ రూమ్స్ లలో స్మార్ట్ టీవీ , ట్యాబ్ లతో అనుసంధానం చేయబడి విద్యాబోధన ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, లీడ్ స్కూల్ కోఆర్డినేటర్ నాటి ధన రాజు, బొమ్మిడి నాగేంద్ర వర్మ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.