* ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
విశ్వం వాయిస్ న్యూస్
*విజయవాడ : రాబోవు ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలలో గెలవాలని జగన్ మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. 174 నియోజకవర్గాల పరిస్థితి దేవుడు ఎరుగు. ముందు పులివెందులలో గెలిచే పరిస్థితి ఉందో లేదో ఆలోచించుకోవాలన్నారు. గడప గడప ప్రోగ్రామ్ అట్టర్ ఫెయిల్యూర్ అని, బస్ యాత్ర తుస్సు యాత్ర అయ్యిందని విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.*
*వైసిపి పట్ల ప్రజా వ్యతిరేకతకు ఇవి నిదర్శనాలని, అయినా వైసిపి కి ఎందుకు ఓట్లు వేయాలి? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందుకా?…నిత్యావసర సరుకుల ధరలు పెంచినందుకా?…అవినీతి ఆంధ్ర ప్రదేశ్ గా మార్చినందుకా?… అరాచక పాలన అందిస్తునందుకా.?. రైతులకు అన్యాయం చేసినందుకా?… ఉద్యోగులను మోసం చేసినందులకా..?నిరుద్యోగులను నమ్మించి మోసగించినందుకా?..రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకా?..ప్రత్యేక హోదా సాధించ లేనందుకా?.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.*
*ముట్టుకుంటే షాక్ కొట్టేలా కరెంట్ ఛార్జీలు పెంచినందుకా?… ఆర్టీసి ఛార్జీలు పెంచినందుకా…? పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ ధరలు ఎక్కువ ఉన్నందుకా..? రైతుల మోటార్ల కు మీటర్లు బిగిస్తునందుకా?…అయినా తల్లికీ, చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తాడని ఓట్లు వేయాలి? అని తులసిరెడ్డి పేర్కొన్నారు.*