విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
వైస్సార్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లోనికి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చంనాయుడు, యువ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ బాబు అనివర్గాలను, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఈచేతకాని, అసమర్థ, దద్దమ్మ వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న అలుపెరుగని పోరాటానికి, కార్యకర్తలకు మేమున్నామని ఇచ్చే భరోసాకు, రానున్నది మన తెలుగుదేశం ప్రభుత్వమేనని అపుడు యువతకు పెద్దపీట వేస్తామని వారిచ్చే భరోసాతో కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు నాయకత్వంపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై రావులపాలెం గ్రామానికి చెందిన శెట్టిబలిజ సామాజికవర్గం నుండి యువకుడు ఇళ్ల సతీష్ తో పాటు మరొక 15 మంది అనుచరులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ బాద్యులు బండారు సత్యానందరావు సమక్షంలో బండారు స్వగృహం నందు తెలుగుదేశం పార్టీ లోనికి చేరడం జరిగింది వీరందరికీ బండారు పార్టీ కండువాలు కప్పి సాధరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఇళ్ల సతీష్ మరియు వారి అనుచరులు సుమారు 200 మందితో రావులపాలెం నుండి వాడపాలెం బండారు స్వగృహానికి బైక్ ర్యాలీతో బాణా సంచాలతో భారీగా తరలి వెళ్లారు ఈ సందర్బంగా పార్టీ మారిన ఇళ్ల సతీష్
పంపన సతీష్
వాసంశెట్టి వెంకటేష్
కుడుపూడి చంటి
లంకె ఫణీంద్ర వర్మ
గుత్తుల రమేష్ చంద్ర
గుత్తుల రోహిత్
పెదపట్నం దొరబాబు
అప్పారి శ్రీను
కేత దుర్గారావు
వాసంశెట్టి రాము
కొప్పిశెట్టి ధనుష్ కుమార్
కడలి నరసింహమూర్తి
పాటి ఆంజనేయులు
కుడుపూడి పవన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పని చేస్తాం అని
మాతో పాటు మా కుటుంబ సభ్యులు సుమారు 100 మంది తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వీళ్లంతా కూడా పార్టీ కోసం కష్టపడతారు అన్నారు
ఈకార్యక్రమంలో రావులపాలెం గ్రామపార్టీ అధ్యక్షుడు పడాల బులికొండారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు, కోనసీమ జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు మరియు కొత్తపేట మరియు రావులపాలెం మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు…