విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుమంట్ర:
పెనుమంట్ర ( విశ్వంవాయిస్ ప్రతినిధి)
మండలంలోని నెగ్గిపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం 13వ రోజు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు, ఆచంటశాసనసభ్యులు,జిల్లా పార్టీ అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మొదట సచివాలయం సందర్శించి, వాలంటరీ సిబ్బందితో సమీక్ష నిర్వహించి, సమస్యలను వివరాలను అడిగి తెలుసుకుని గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి ప్రభుత్వ పని తీరుపై ఆర్టీసీ సంక్షేమ పథకాలు ఏవిధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం ధనలక్ష్మి ఎంపీటీసీ పీ లక్ష్మి వార్డు సభ్యులు గుత్తుల సాల్మన్ దొర నరసింహ మూర్తి వెంకటలక్ష్మి, పెనుమంట్ర మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సత్తి విష్ణు కుమార్ రెడ్డి రైతు నాయకులు వెంకటరెడ్డి, స్థానిక నాయకులు పాలసత్తి రామిరెడ్డి (రాజా) భాస్కర్ రెడ్డి, కీర్తి తాతాజీ,జడ్పీటీసీ కర్రీ గౌరీ సుభాషిణి వేణుబాబు.ఎంపీపీ కర్రి వెంకట నారాయణ రెడ్డి (వాసు), పెనుగొండ ఏఎంసీ చైర్మన్ వెలగల పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరరావు వీఆర్వో మాధవరావు, సచివాలయ సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్ సత్యనారాయణ, మహిళా పోలీస్ జ్యోతి, వాలంటీర్లు,వివిధ శాఖల సిబ్బంది పాల్గొనగా పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, పెనుమంట్ర ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ వేండ్ర వెంకటేశ్వరరావు భద్రతా చర్యలు తీసుకున్నారు.