విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )
సుమారు రెండు నెలలుగా కావాలనే కపిలేశ్వరపురం మండలం నాగులచెరువు గ్రామంలో అధికార వైసీపీ నాయకులు ఒత్తిడితో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టలేదని ఆ గ్రామ సర్పంచ్ వాసంశెట్టి సత్యనారాయణ, ఎంపీటీసీ కుంచె ప్రసన్న కుమార్ లు ఆరోపించారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ వాస 0సెట్టి వెంకటరమణ మరణం తో ఖాళీ గా వున్న ఆ పోస్ట్ ను స్థానిక వైసీపీ నాయకులు నిబంధనలు కు విరుద్ధంగా తమకు కావలసిన వారుకి ఇప్పించుకోవాలనే ఉద్దేశ్యం తోనే అధికారులు పై వత్తిడి తెచ్చి ఉపాధి పనులు అపుచేయించారన్నారు. తమ గ్రామంలో ఉపాధి పనులు కల్పించమని ఏ పీ ఓ కు, ఎంపిడివో కు గత రెండు నెలలుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని సర్పంచ్ వాసంశెట్టి సత్య నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల ఆరవ తేదీన సోమవారం రామచంద్ర పురం ఆర్ డి ఓ కార్యాలయంలో జరిగిన స్పందన లో నాగులచెఱువు గ్రామంలో ఉపాధి పనులు కల్పించమని వ్రాత పూర్వకంగా కోరడం జరిగింది అని సర్పంచ్ అన్నారు.సర్పంచ్ గా ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అదికారులు పెడచెవిన పెట్టారన్నారు. గత బుధవారం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగే శ్వరరావు గారు ఎంపిడివో కార్యాలయం నకు వచ్చి, వెంటనే ఆ గ్రామంలో ఉపాధి పనులు కల్పించలేని పక్షంలో ఆఫీస్ ముందు కూలీలుతో ఆందోళన చేయిస్తానని హెచ్చరించారని వాకతిప్ప గ్రామ ఎంపీటీసీ కుంచె ప్రసన్న కుమార్, టీడీపీ అధికార ప్రతినిధి పుత్సల శ్రీను వాస్ లు అన్నారు. దీంతో ఆ మర్నాడే నాగులచేరువు గ్రామంలో ఉపాధి పనులు చేపట్టారు అన్నారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం సర్పంచ్ శాఖా శ్రీనివాస్, గుడాల జయ బాబు, వైస్ ప్రెసిడెంట్ మేడిసెట్టి సత్య నారాయణ, వాసంశెట్టి శ్రీని వాసు,షేక్ కరీం, అల్లూరి రామ కృష్ణ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.