విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
అమ్మ ఒడి పథకానికి సంబంధించి కొందరు అర్హులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అనర్హుల జాబితాలో చేర్చింది. ఆరు నెలల సరాసరి 300 యూనిట్లకు దాటనప్పటికీ పలువురిని అనర్హుల జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలో మండపేట మున్సిపల్ కమీషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ను వివరణ కోరగా ఏవైనా సవరణలు వుంటే పరిశీలన జరిపి అర్హుల జాబితాలో చేర్చుతామన్నారు. మొన్నటి వరకూ ఆరు నెలల సరాసరి 300 యూనిట్లకు దాటితే అనర్హుల జాబితాలో చేర్చేవారు. అయితే ఇప్పుడు సంవత్సరం వెనక్కి విద్యుత్ బిల్లులను సేకరించి వాటిలో అత్యధికంగా వచ్చిన ఆరు నెలల విద్యుత్ బిల్లులను సేకరిస్తున్నారు. వాటి మొత్తాన్ని మాత్రం యావరేజ్ చేసి 300 యూనిట్లు దాటితే వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని కమీషనర్ రామ్ ధృవీకరించారు. అదే విధంగా కార్ కలిగివున్న, ఆదాయ పన్ను చెల్లిస్తున్నా, 1000 చదరపు అడుగుల విస్తీర్ణం దాటి ఇల్లు నిర్మించుకున్నా, మూడెకరాల మాగాణి వున్నా, ఏడున్నర ఎకరాల మెట్ట భూమి వున్నా అమ్మఒడి పథకానికి అనర్హులు గా గుర్తించబడతరన్నారు. పై కారణాలు లేనప్పటికీ ఎవరి పేరైన అనర్హుల జాబితాలో వుండి వుంటే తక్షణం సచివాలయం లో పిర్యాదు చేయాలన్నారు. పిర్యాదు పై పరిశీలన జరిపి అర్హత వుంటే వారిని అమ్మఒడి అర్హుల జాబితాలో చెర్చుతామన్నారు.