విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్ ఆధ్ర్యర్యంలో గురువారం చిన్న పిల్లల కేన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సంధర్బంగా చిన్న పిల్లల వైద్య నిపుణుల డా ఆర్ శ్రీధర్ మాట్లాడుతూ”కాన్సర్‌ను ఎదుర్కొనే ముందు చాలా లక్షణాలు, మార్పులు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా జ్వరం, హెమోగ్లోబిన్ తగ్గిపోవడం, ర్యాషెస్ వంటివి కనబడతాయి మరియు కడుపు, మెడ, ఛాతి వంటి భాగాలలో లేదా ఎముకలలో నొప్పి ఉంటుంది. దాంతో పాటుగా వాపును కూడా గమనించవచ్చు. కంటి చూపులో తేడా గమనించుతారు. కాన్సర్ వ్యాధి ముప్పు తగ్గించడానికి కేవలం ఒకే మార్గం ఉంటుంది. అది ఏంటంటే ముందుగానే కాన్సర్‌ను కనుగొనాలి.
తల్లిదండ్రులు చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చిన్న లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. చిన్న పిల్లలు ఆకలిలో మార్పులు వచ్చినా, బరువు తగ్గినా, ఎప్పుడూ లేని విధంగా ర్యాషెస్, వాపు వంటివి కనబడితే తప్పకుండా సరైన మెడికేషన్‌ను తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో క్లబ్ అధ్యక్షుడు లయన్ ద్వారంపూడి విపుల్ ,నిమ్మకాయల వెంకటేశ్వర రావు,డా అడ్డాల సత్యనారాయణ,షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.