విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ న్యూస్:
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రొహిబిషన డిక్లైర్ అయిన సచివాలయ కార్యదర్శులు ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త జీతాలు అందుకోనున్నారని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు చెప్పారు. ఇందుకు సంబంధించి కార్పొరేషన్ కార్యదర్శి ఏసుబాబు, మేనేజర్ కర్రి సత్యనారాయణ, ఆయా సెక్షన్ సూపరింటెండెంట్లతో శుక్రవారం సాయంత్రం ఏడీసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏడీసీ నాగనరసింహారావు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ పరిధిలో 909 మంది సచివాలయ కార్యదర్శులకు గాను, 821 మంది పనిచేస్తున్నారన్నారు. వీరిలో 575 మంది సచివాలయ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ తరువాత ప్రొబిషన్ డిక్లైర్ చేసిందన్నారు. గతంలో వీరందరూ రూ.15వేలు చొప్పున వేతనం పొందేవారని, ఆగస్టు 1వ తేదీ నుంచి పెరిగిన వేతనాలతో జీతాలు అందుకోనున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ కృతికాశుక్లా, కమిషనర్ కె..రమేష్ ఆదేశాల మేరకు పెరిగిన వేతనాల ప్రకారం జీతాలు అందేలా శాఖాపరమైన చర్యలన్నీ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఏడీసీ ఆదేశించారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఏడీసీ కోరారు.సమావేశంలో ఆయా సెక్షన్ల సూపరింటెండెంట్లు, 101 విభాగంలోని కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.