విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
*ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే అవసరం ఏమొచ్చింది ?*జగన్మోహన్ రెడ్డి*
*జనసేన పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొప్పుల నాగ మానస*
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం సెప్టెంబర్ 22 అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం జనసేన పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొప్పుల నాగమానస గురువారం నాడు జగన్మోహన్ రెడ్డి ఆకస్మికంగా విజయవాడలో గల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ శాసనసభలో బిల్లు పెట్టడంపై స్పందిస్తూ అయ్యా జగన్ మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో రాక ముందే మీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంబిబిఎస్ చదివి డాక్టర్ గా ప్రజలకు సేవ చేయవచ్చు ప్రజలచే ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు వైద్య సదుపాయం అందాలనే ఉద్దేశంతో 108, 104 , సేవలను ప్రజలకు అందుబాటులో కి సీఎంగా నెగ్గిన తర్వాత పెట్టిన పథకాలు, కానీ సినీ రాజకీయ ప్రస్థానంలో ప్రజల గుండెల్లో భగవంతుడిగా సాక్షాత్ శ్రీకృష్ణుడిగా ముద్రించ బడిన స్వర్గీయ నందమూరి తారకరామారావు, ముఖ్యమంత్రిగా రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాతమ ప్రజలకు కూడు, గూడు, గుడ్డ, అనే నినాదంతో నెగ్గి వాటిని ఆచరణలో పెట్టిన మహా నాయకుడు పేరును ఉన్నట్టుండి మార్చడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు, అలాగే ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, శాస్త్రవేత్తలు ఉన్నారు మరి వారి పేర్లు ఎందుకు పెట్టలేదు నీ యొక్క సొంత సంస్థలైన, భారతి సిమెంట్ కి, సాక్షి పేపర్, లోట్హౌస్ కి, రియల్ ఎస్టేట్ కి నీ తండ్రి పేరు ఎందుకు పెట్టుకోలేదు 1986లో స్థాపించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుపై మీకు ఎందుకంత కక్ష చంద్రబాబు నాయుడు పై కక్షసాధింపు తో మామా అయిన ఎన్టీ రామారావు పేరు ఉండకూడదని కక్ష సాధింపు మంచిది కాదని అలాగే వైజాగ్ లో ఉన్న డాక్టర్ సుధాకర్ మాస్కుల కోసం అడిగినందుకు శారీరకంగా ఎన్నో వేధింపులు పెట్టి మానసికంగా చనిపోయేలా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వసతులు లేక ఉన్నటువంటి హాస్పటల్ పై దృష్టి పెట్టకుండా ప్రజలు అనారోగ్యాలతో పడుతున్న ఇబ్బందులను గుర్తించకుండా హెల్త్ మినిస్టర్ విడుదల రజనీకి, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ శాసనసభలో బిల్లు పెట్టడం పై శ్రద్ధ చూపటం ఏమిటని మీరు చేసే పనులను చూస్తూ మా డాక్టర్స్ ఉంటారు అనుకోవడం పొరపాటని అవసరమనుకుంటే రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ ఉద్యమిస్తుందని మీకు తగిన గుణపాఠం నేర్పుతుందని తెలిపారు.