– కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో భాగంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విభజన హామీలు అన్నిటిని తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా కోరారు.గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరంలో ఆర్ట్స్ కళాశాల నందు నిర్వహించిన భారీ బహిరంగ సభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మర్యాదగాపూర్వకంగా కలుసుకుని విభజన హామీలు అన్నిటిని పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించడం జరిగిందన్నారు.
ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నేటికీ నెరవేర్చలేకపోవడం చాలా బాధాకరమన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జీవనాడిగా ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని గత టిడిపి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం వల్ల అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని తద్వారా అనేకమంది నిరుద్యోగులకు ఉద్యోగుల అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు..
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆనాడు పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ 2014 ప్రత్యేక హోదా అంశం మరియ విభజన హామీలోని అంశాలను త్వరగతిన పరిష్కరించి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుని ప్రగతి పథంలోకి తీసుకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని నితిన్ గడ్కరీని ఎమ్మెల్యే కోరారు.