విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం నియోజకవర్గ , అయినవిల్లి మండలం:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అయినవల్లి మండలం విలస గ్రామంలోమన్నా మినిస్ట్రీస్ వారి న్యూ లైఫ్ సెంటర్(కుష్టు రోగుల నివారణ మరియు పునరావాస కేంద్రం)లో సామాజిక సంఘ సేవకుడు గంగుమళ్ళ శ్రీనివాస్ పుట్టినరోజును అక్కిశెట్టి దుర్గారావు నేతృత్వంలో ఘనంగా తెలుగుదేశం కార్యకర్తలు గురువారం నిర్వహించారు. ఈపుట్టినరోజు వేడుకకు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జాతీయ అభిమాన సంఘ అధ్యక్షులు వక్కలంక బుల్లియ్య, దళిత నాయకులు గిడ్ల వెంకటేశ్వరరావు చేతులమీదుగా రోగులకు, స్థానిక వికలాంగులకు దుప్పట్లను,పాలు రొట్టెలు,పండ్లను పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారినపడి అయోమయ పరిస్థితులలో ఉన్న కుటుంబాలకు మేమున్నామని కుల మత భేదం లేకుండా ప్రాణాలకు తెగించి అండగా నిలబడిన నాయకత్వ లక్షణానికి సరికొత్త నిర్వచనంగా నిలచిన ఘనత స్థానిక మాజీ జెడ్పిటిసి సభ్యురాలు కాశీ అన్నపూర్ణా శ్రీనివాస్ ఆదర్శ దంపతులదేనన్నారు. వరదలు,అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ వారి సాహసోపేతమైన సేవలు అజరామరమని మన ప్రాంత వాసులైనందుకు మనకు మరింత గర్వకారణమన్నారు ఆదంపతుల కుటుంబాలను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. తదుపరి 32 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్న సాహెబు దంపతులను దుశ్శాలువలతో సత్కరించి సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో చిక్కం పల్లంరాజు,అల్లం తాసు,వల్లభరెడ్డి ఫణి బాబు,నల్ల మణికంఠ,అల్లం చిన్ని,అక్కిశెట్టి పవన్,గంజి దుర్గారావు,అల్లం పండు,తుండూరు బాబి, బండారు పరమేష్,అమలకట్ట అయ్యప్ప,కొక్కూరిమెట్ట శ్రీను,అడబాల బాబి,షేక్ మాబు,రుద్రాక్షలు ప్రసాద్ పాల్గొన్నారు.