Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తమ కొడుకు మృతికి కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విద్యార్థి అదృశ్యం మృతిపై వీడని మిస్టరీ
తమ కొడుకును చంపేసారంటూ తల్లిదండ్రుల ఆవేదన
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిగన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో విద్యార్థి తల్లిదండ్రుల నిరాహార దీక్షహత్యా కోణంలో దర్యాప్తు చేయాలని డిమాండ్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

విద్యార్థి అదృశ్యం మృతిపై వీడని మిస్టరీ .

హత్యా కోణంలో దర్యాప్తు చేయాలని డిమాండ్

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

తమ కొడుకును చంపేసారంటూ తల్లిదండ్రుల ఆవేదన
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిగన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో విద్యార్థి తల్లిదండ్రుల నిరాహార దీక్ష బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేపట్టారు. అంబాజీపేటలో విద్యార్థి అదృశ్యం, మృతి పై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. గత సెప్టెంబర్ నెల రెండవ తారీఖున అంబాజీపేట హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న మట్టపర్తి రాజేశ్వరరావు స్కూల్ నుంచి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత స్థానిక కొర్లపాటి వారి పాలెం వనుములమ్మ గుడి సమీపంలోని మురుగు కాలవలో శవమై తేలాడు. అయితే ఇప్పటివరకు కేసును ఎటు తేల్చకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులైన మట్టపర్తి వెంకటేశ్వరరావు, దుర్గాభవాని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అంబాజీపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు దిగారు. స్కూల్ నుంచి బయటికి వెళ్లిన తమ కుమారుడు అదృశ్యమై, మురుగు కాలవలో బట్టలు లేకుండా శవమై తేలడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాత వచ్చిన రిపోర్టులో తమ కుమారుడిని హత్య చేసినట్లుగా ఉందని చెప్పారు. అయితే పోలీసులు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. అటు స్కూల్ హెచ్ఎం పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజ్ లోని కనిపించిన మిగతా విద్యార్థులను బయటకు రానివ్వకుండా కేసును నీరుగారుస్తున్నారన్నారు.
ప్రత్యేక అధికారి ద్వారా హత్యా కోణంలో కేసును దర్యాప్తు చేయాలన్నారు. కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూలు హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ నిరాహార దీక్ష కొనసాగిస్తామని కన్నీరు మున్నీరుగా విలపించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement