విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ:
- కాకినాడ జిల్లా కాజులూరి మండలం పల్లిపాలెం గ్రామంలో ఆదివారం మధునాపంతుల కామరాజు సాంస్కృతిక ప్రాంగణం నందు మధునా పంతుల సత్యనారాయణమూర్తి అధ్యక్షతన మధుశ్రీ కథా గౌరవ సభ అత్యంత వైభవంగా జరిగింది.తెలుగు కథా సాహిత్యంలో ఆరి తేరిన పలువురు కథా రచయితలు ఈ సభకు విచ్చేశారు.ఈసమావేశంలో మధునాపంతుల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మధునాపంతుల కిరణ్ మాట్లాడుతూ తన తండ్రిగారైన మధుశ్రీ రాసిన కదలన్నిటినీ పాఠకులచే చదివించాలనీ,ఆ కథలను చదివి మరింతమంది తెలుగు కదా సాహిత్యం వైపుకు ఆకర్షితులై రచయితలుగా మారాలనే ఉద్దేశంతో ఆయన కథలన్నిటినీ
మధుశ్రీలు అనే పుస్తకాన్ని పబ్లిష్ చేయడం జరిగిందని అన్నారు.తన తండ్రి అయిన మధు శ్రీ జ్ఞాపకార్థం ప్రతి ఏటా ముగ్గురు కథా రచయితలను ఎంపిక చేసి వారికి నగదు పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేయడం జరుగుతుందని కిరణ్ తెలిపారు.2022 సంవత్సరం నుంచి ప్రతి ఏటా విధిగా జనవరి ఫిబ్రవరి నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.అలాగే ఈ 2024 సంవత్సరం కూడా మధుశ్రీ కదా గౌరవ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కథ విశ్లేషకులు వంశీకృష్ణ ,మల్లేశ్వరరావు,అనిల్ డ్యానీ లు ఎంపిక చేసిన ముగ్గురు రచయితలకు ప్రఖ్యాత రచయిత చింతకింది శ్రీనివాస రావు, ఎండపల్లి భారతి,భగవంతం ముగ్గురు కదా రచయితలను ఎంపిక చేసి నగదు పురస్కారాలను అందించి గౌరవించడం జరిగింది. చింతకింది కి 20వేలు,భారతి కి 20వేలు భగవంతం కి 10 వేలునగదుతోబాటు సన్మానం జరిగింది.