విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
- రామచంద్రపురం విశ్వం వాయిస్ పట్టణ రత్నంపేటలో గల ఒక ఇంటిలో దొంగనోట్లు ముద్రిస్తునారన్న పక్కా సమాచారంపై,ఎస్సై రామచంద్రపురం అందుబాటులో ఉన్న సిబ్బంది మరియు మద్యవర్తులు తీసుకొని సదరు ఇంటి వద్దకు వెళ్ళి వారి యొక్క నేర ఒప్పుధల ప్రకారం నలుగురిని అదుపులోనికి తీసుకొని వారి వద్ధ నుండి 75,000 రూపాయల దొంగ నోట్లు 500 నోట్లు 150 డినామినేషన్ తో పాటుగా దొంగ నోట్ల తయారీకి వాడిన సామగ్రి ప్రింటర్స్ 02,పెన్ డ్రైవ్ కింగస్టన్ 64జీబీ 01,డెల్ లాప్టాప్ 01,పేపర్ కట్టర్ 01,ఐరన్ బాక్స్ 01,ఏ4 సైజు వైట్ పేపర్స్ రియం, కనెక్టింగ్ కేబుల్స్,థ్రెడ్,స్టైకెర్డ్,ఏ4 సైజు షీట్స్10 స్వాదినపరుచుకోవడం జరిగినధి.మొదటి ముద్దాయి మాగంటి గోపి,రెండవ ముద్దాయి బోయ గోవింద రావు,మూడో ముద్దాయి వాసంశెట్టి వీరభద్ర రఘు రామ్,రఘు,నాల్గవ ముద్దాయి బాడుగంటి వీర వెంకట రమణ లు పట్టుబడగా,పరారీలో ఉన్న అయిధవ మరియు ఆరవ ముద్దాయిలు చల్లా నూకా రెడ్డి,మీసాల అప్పల రాజుల ప్రమేయం దర్యాపుతులో నిర్ధారణ అయినందున త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది.ఈకేసులో ఇతర వ్యక్తుల యొక్క ప్రమేయం ఏమైనా ఉన్నదనే కోణంలో కూడా సమగ్ర దర్యాప్తు చేయడం జరుగుతున్నది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్,ఐపీఎస్ ఆదేశాల మేరకు,అడిషనల్ ఎస్పీ ఎస్.ఖాదర్ బాషా పర్యవేక్షణలో,రామచంద్రపురం డిఎస్పి బి.రామకృష్ణ ఆధ్వర్యంలో,చాకచక్యంగా వ్యవహరించి దొంగ నోట్లు ముఠాను పట్టుకునందుకు గాను రామచంద్రపురం సి.ఐ.పి.దొరరాజు, రామచంద్రపురం ఎస్ ఐ కె.సురేష్ బాబు మరియు సిబ్బందిని అభినందించడం జరిగింది.