– ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు గ్రామం బేడ బుడగ జంగాల కాలనీలో జరిగిన సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా వీర్నపల్లి ఏసు ఎన్నికయ్యారు.జిల్లా ప్రధాన కార్యదర్శి, గౌరవ అధ్యక్షులు గాశెరాబంద్,మోదే పద్మనాభం, ఉపాధ్యక్షులుగా పిర్ల నాగులు, కళ్యాణ నాగరాజు, కార్యదర్శిగా సిలువాటి సియోను, సంయుక్త కార్యదర్శిగా కుమార్ చిన పిచ్చయ్య, కోశాధికారిగా పీర్ల చిన వెంకట్రావు,కార్యవర్గ సభ్యులుగా కప్పరి వెంకటేశ్వర్లు, విభూది పోశయ్య,పీర్ల దుర్గం,ఊర రంగా రావు, పీర్ల వెంకన్న,తూరపాటి దుర్గారావు, ఊర వెంకటేశ్వర్లు, నేర్లగంటి సంసోన్ కప్పరి లింగాలు గంటి పరిశుద్ధరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు, గౌరవ అధ్యక్షులు మోటూరి రాము,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంగువ చిన్న సత్యనారాయణ,రాష్ట్ర సభ్యులు ఇంగువ పెద్ది రాజు, కాకినాడ జిల్లా అధ్యక్షులు మోటూరు సింహాచలం సమక్షంలో జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది.అనంతరం సభను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఎస్సీ 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9.లో పొందు పరచి నప్పటికీ ఎస్సీ సర్టిఫికెట్ పొందుతున్న మా బేడ బుడగ జంగం వారికి 2008లో 144 జీవో అప్పటి ప్రభుత్వం తీసుకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ జంగం కమ్యూనిటీకి ఎస్సీ సర్టిఫికెట్ నిలుపు వేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించి ఐఏఎస్ రిటైర్మెంట్ జేసి శర్మ కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ 13 జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి 8.6.2020 న రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందించడం జరిగిందని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాల 4 నెలలు అయినప్పటికీ ఇటు అసెంబ్లీలో గాని క్యాబినేట్లో గాని తీర్మానం చేయలేదని విమర్శించారు. బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కమిటీలను ఎన్నుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన రాజ్యాంగం కల్పించిన ఎస్సీ సర్టిఫికెట్లు పొందేంతవరకు అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రభుత్వం దిగివచ్చేవరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని మధు హెచ్చరించారు జిల్లా అధ్యక్షుడు వీర్నపల్లి ఏసు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.సంఘ సభ్యులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇప్పించేందుకు రాష్ట్ర కమిటీ చేస్తున్న పోరాటాన్ని ముందుకు తీసుకు వెళతామని చెప్పారు..ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అన్ని నియోజకవర్గాలు నుంచి బేడ, బుడగ, జంగం ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. సమావేశంలోరాష్ట్ర యూత్ నాయకులు మోటూరు మహేష్,
రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు నిరుకొండ నూకరాజు, మగ్గు సింహాద్రి,కప్పిరి వెంకన్న,శివరాత్రి వెంకన్న,వీర్నపల్లి జాను,పేర్ల నాగులు,ప్రసాదం రామకృష్ణ,పేర్ల శ్రీను, కప్పిరి ఏసు,కప్పిరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.