– విజేతలకు బుల్లెట్,విద్యుత్ బైక్లు బహుకరణ…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజానగరం:
తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో ఎడ్లబండ్ల పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు.. రంగంపేట మండలం వడిశలేరు గ్రామం నందు గన్ని సత్య నారాయణమూర్తి జ్ఞపకార్థం జి.ఎస్.ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ డాక్టర్ గన్ని భాస్కర రావు ప్రతి ఏడాది మాదిరిగానే రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించి తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్నారన్నారు
మన ప్రాంతానికి తలమానికంగా నిలిచిన జిఎస్ఎల్ ఆసుపత్రి ద్వారా అనేక రకాల వైద్య సేవలు అందిస్తూ సేవారంగంలో ఘనమైన ముద్ర వేసుకుని డాక్టర్ గన్నీ భాస్కరరావు అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.డాక్టర్ గన్ని భాస్కర రావు కోవిడ్ వంటి విపత్కర సమయంలో ఎంతోమందికి వైద్య సేవలు అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారన్నారు.
జి.ఎస్.ఎల్ ట్రస్ట్ మరియు జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్ ద్వారా రాజానగరం నియోజకవర్గంలో ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి క్యాన్సర్ రహిత రాజానగరం నియోజవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.తెలుగు సంస్కృతిక సంప్రదాయాలకు అద్ధం పట్టేలా నిర్వహిస్తున్న ఈ ఎడ్ల బండి పోటీ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు..