విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాష్ట్రం ముఖ్యమంత్రి రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రతి సంవత్సరం 58 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆర్జెడి డి.మధుసూదన్ రావు అన్నార. మండల కేంద్రమైన రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆర్జెడి డి. మధుసూదన రావు తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల విద్య ప్రమాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించి అనంతరం రుచి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదిలోని తెలివైన విద్యార్థినుండే వెనుకబడిన విద్యార్థులకు అందరికీ తగువిధంగా విద్యాబాలన్ చేసే విధంగా టీచర్లు ప్రణాళికల రూపొందించుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలను ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పప్పు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.