విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
మండలం మాచవరం గ్రామంలో సోమవారం అత్యంత వైభవంగా శ్రీ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాలధారణ దారులు స్వాముల ఆధ్వర్యంలో కావిడి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి మాలధారణదారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనగా గ్రామ వీధుల్లో నిర్వహించిన స్వామి వారు అధిరోహించిన వాహనానికి మహిళలు పసుపు నీళ్లతో రోడ్లు పొడవున స్వాగతం పలికారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలసొత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 45 మంది సుబ్రహ్మణ్య స్వామి మాల ధారణ చేసిన స్వాములు సుబ్రహ్మణ్య షష్టి పురస్కరించుకొని, సుబ్రహ్మణ్యస్వామి కావిడలను ధరించి, స్వామి నామాలను జపిస్తూ నృత్యం చేస్తూ గ్రామోత్సవంలో పాల్గొన్నారు. గ్రామ వీధులలో ప్రత్యేకంగా అలంకరించిన రథముపై స్వామి వారిని ఊరేగింపు నిర్వహించారు. సుమారు 200 మంది పుణ్యస్త్రీలు కలశాలను శిరస్సున పెట్టుకుని, భాజా భజంత్రీలు, గరగ నృత్యాలు, శక్తి వేషధారణ నృత్యాలు, తదితర సాంస్కృతి కార్యక్రమాలతో బాణాసంచా కాల్పుల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. తొలుత స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించిన అనంతరం గ్రామోత్సవం ప్రారంభించారు.