*గతం లో కూడా పోలీసులతో పలుమార్లు కేసులు నమోదు చేయించిన షేక్ హాజర్*
*అప్పటి తహసీల్దార్ మరియు ముస్లిం పెద్దల సమక్షంలో కేసు వాపసు*
*మళ్ళీ పదవి దక్కటం తో పదవి అహంకారం తో అక్రమ కేసులు*
విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామం వైసీపీ అధికార పార్టీ కి చెందిన మైనారిటీ కోప్షన్ మెంబర్ షేక్ అజహర్ మరియు వారి కుటంబసభ్యులు అధికార మదం తో పార్టీ అండదండలతో రావులపాలెం గ్రామం రెండు మసీదులకు చెందిన మైనార్టీ ముస్లింలు కొంతమంది పై తమను నాయకులుగా గౌరవించడం లేదని తను చెప్పినట్లుగా నడుచుకోవడం లేదని అధికార మదం తో తప్పుడు కేసులు పెట్టి తమను వేధిస్తున్నారని ఇప్పటికి తమపై 3 సార్లు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టగా ఒక సారి ఎఫ్. ఐ. ర్ నమోదు కూడా చేశారని మళ్ళీ పెద్దల సమక్షంలో కేసు వాపసు తీసుకున్నారని మళ్ళీ ఇప్పుడు కొత్తగా సదరు వ్యక్తి కి మైనారిటీ కో ఆప్షన్ పదవి దక్కినందున పదవీ అహంకారం తో మళ్ళీ తప్పుడు కేసులు పెట్టె ప్రయత్నం చేయగా పోలీసు వారు దీన్నీ గమనించి ఇరువర్గాల వారిని మందలించి పంపించారని ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి పైనే తప్పుడు కేసులు పెట్టి వేదించారని సామాన్య ప్రజలు మేము ఎంత అని.కాక పోతే నిజాయతీ గల పోలీసులు ఇప్పటికి ఉండడం వల్లే తప్పుడు కేసులు నుంచి బయట పడుతున్నాం అని దీనికి రావులపాలెం పొలీస్ వారికి మైనారిటీ ముస్లింలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ మళ్ళీ స్టేషన్లో ఎస్. ఐ మారగానే మళ్లి కొత్తగా కేసులు పెట్టె ప్రయత్నం చేస్తున్నారని ఈ వేధింపుల తట్టుకొనే శక్తి మాకు లేదని తెల్లవారితే బతుకు తెరువు కోసం కూలీ పనులు చేసుకొనే మాకు సంపూర్ణ విముక్తి కావాలని దీనిపై స్థానిక ఎమ్మెల్వై చిర్ల జగ్గిరెడ్డి అటువంటి స్వార్ధపు నాయకులను పార్టీ నుంచి రాజీనామా చేయించి తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తమకు సంపూర్ణ న్యాయంచేయాలని సయ్యద్ రియాజ్ పాషా, మరియు రెండు మసీదుల ముస్లిం సభ్యులు కోరుతున్నారు.