విశ్వంవాయిస్ న్యూస్, పి గన్నవరం:
ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు
పి. గన్నవరం(విశ్వం వాయిస్ న్యూస్)
ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఈనెల 19, 20, 21 తేదీలలో పి. గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. ఈ మేరకు పి గన్నవరం వైకాపా కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ 19వ తేదీన అయినవిల్లి మండలం ముక్తేశ్వరం పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా 20వ తేదీన పి. గన్నవరం లోని గ్రేస్ డిగ్రీ కళాశాల వద్ద వికాస, కొండేటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పండగ వాతావరణం లో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా 21వ తేదీన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అదే రోజున ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్ లను అందించనున్నామన్నారు. తుఫాన్ కారణంగా తడిచిన ధాన్యాన్ని రైతుల నుండి పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పేరి శ్రీనివాస్, అంబాజీపేట ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, అంబాజీపేట ఏఎంసి వైస్ చైర్మన్ నాగవరపు నాగరాజు, పి గన్నవరం మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు తోలేటి బంగారు నాయుడు, వైకాపా నాయకులు నక్క వెంకటేశ్వరరావు, కొండేటి వికాస్ బాబు, వాసంశెట్టి చినబాబు, మంతెన రవిరాజు, అప్పన రాము, దొమ్మేటి శివరాం, దేశిరాజు సాయి, కొండేటి వెంకటేశ్వరరావు, సాధనాల రమేష్, మోకా శ్రీను, తదితరులు పాల్గొన్నారు.