విశ్వంవాయిస్ న్యూస్, కడియపులంక:
కడియం సి.ఐ తిలక్ ఖండ కావరం
– దళిత యువకులను బంధించి చావబాదిన సి.ఐ
– తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన యువకులు
– విషయం బయట పెడితే హత్య చేసి,ఆత్మహత్యగా చిత్రీకరిస్తానంటూ బెదిరింపులు
కడియం, విశ్వం వాయిస్ న్యూస్ : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం పోలీస్ స్టేషన్ సి.ఐ తిలక్ సార్ కు ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. తాను శాంతి భద్రతలు కాపాడాల్సిన ఒక యూనిఫామ్ వేసుకున్న పోలీసు అధికారినని మరచి ఖండ కావరంతో యువకులపై లాటి జులిపిస్తూ రెచ్చిపోయారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు.ఒంటిపై ఖాకీ బట్టలు చూసుకొని రెచ్చిపోవడం అతని నైజం, అదే నైజంతో గతంలో విధులు నిర్వహించిన చోట వి.ఆర్ కి వెళ్లి మరలా కడియం పోలీస్ స్టేషన్లో ఏదో విధంగా పోస్టింగ్ సంపాదించారు. పోస్టింగ్ సంపాదించిన నాటి నుంచి తన సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గ కీలక నేత అండదండలతో రెచ్చిపోతున్న సి.ఐ తిలక్ సార్ తాజాగా కడియం గ్రామానికి చెందిన కొందరు దళిత యువకులు దందమాలి మధు,పెనుబోతుల కోదండ రాముడు, తుంగపల్లి రాజేష్,రామకృష్ణ,శశి కుమార్,వర్మ లను కానిస్టేబుల్ కాసాపు దుర్గాప్రసాద్ తో కలిసి విచక్షణారహితంగా చావబాదారు.దీనిలో ఒక యువకుడికి తలపై తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్చారు.మంగళవారం జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా బైటకు వచ్చింది.అసలు ఈ సి.ఐ సార్ కు ఆవేశం కట్టలు తెంచుకొని,యువకులను చావ బాధడానికి అసలు కారణం. కడియం మండలం బుర్రిలంక గ్రామానికిచెందిన యువకులు నెట్ లో సినిమా టిక్కెట్లు తీసుకుని కడియంలో ఉన్న వెంకట సూర్య థియేటర్ కు మంగళవారం రెండో ఆట సినిమాకు ఆలస్యంగా వెళ్లడంతో థియేటర్ గేట్లు వేసేశారు.అక్కడే గేటు వద్ద కాపలాగా ఉన్న వ్యక్తిని యువకులు గేటు తీయమని కోరడంతో ఆ వ్యక్తి గేట్ తీయకపోవడంతో వారి మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది.అనంతరం వారిని సినిమాకు అనుమతించారు.ఇదిలా ఉండగా అక్కడకు చేరుకున్న కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ యువకులను థియేటర్ బయటకు పిలిచి అక్కడే దారుణంగా చావబాదాడు. అంతటితో ఆగకుండా పోలీస్ జీపు లో యువకులను కుక్కి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.అదే సమయానికి స్టేషన్ కు చేరుకున్న సి.ఐ తిలక్ సార్ జరిగిన విషయం తెలుసుకోకుండా థియేటర్ యాజమాన్యం, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ చెప్పిన మాటలు విని ఆవేశంతో దళిత యువకులపై చెప్పడానికి వీలులేని అసభ్య పదజాలంతో దూషిస్తూ, యువకుల ఇంట్లో మహిళలను సైతం అనరాని మాటలు అంటూ, యువకుల మనోభావాలు దెబ్బతినే విధంగా కించపరిచారు.అంతటితో ఆగకుండా యువకులపై విచక్షణారహితంగా లాటితో విరుచుకుపడి లాటి విరిగేలా చావబాదాడు. దీనిలో ఒక యువకుడికి లాటి బలంగా తలకు తగలడంతో తల పగిలి రక్త స్రావం అయింది. అది చూసి అక్కడే ఉన్న కొందరు పోలీసులు యువకుడు తలకు తగిలిన గాయానికి పసుపు రాసి గదిలో బంధించారు. యువకుడు తల నుంచి తెల్లవారిన రక్తస్రావం ఆగకపోవడంతో రహస్యంగా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.జరిగిన విషయాన్ని బయట ఎక్కడైనా ప్రస్తావిస్తే చంపి, రైల్వే ట్రాక్ పై పడుకోబెట్టి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తానని సి.ఐ. తిలక్ సార్ యువకులను హెచ్చరించి వదిలేశారు. ఇదే విషయమై బాధిత యువకులు ఏలూరు రేంజ్ డి.ఐ.జి. పాలరాజును కలిసి లిఖితపూర్వకంగా సి.ఐ. తిలక్ తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో జరిగిన సంఘటనపై విచారణ చేయాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ని డీ.ఐ.జీ. ఆదేశించినట్లు తెలిసింది.ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘం,యస్.సి. కమిషన్ సుమోటోగా స్వీకరించి సి.ఐ. తిలక్ తీరు పై చట్టపరమైన చర్యలు చేపట్టి అతనిని విధుల నుంచి తొలగించాలని అతగాడు స్టేషన్ కి వచ్చిన బాధితులతో పౌరుష పదజాలంతో మాట్లాడతాడని,ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డ బ్రహ్మ పదార్థం లా ఫీల్ అయిపోతున్న సార్ ని ఇంటికి పంపించాలని అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, నిన్నటి నుండి రాజకీయ నాయకుల నుండి బాధితులకు మరియు కులసంఘ నాయకులకు ఫోన్లు వస్తున్నాయని ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని,ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం ప్రతి విషయంలో డబ్బు,డబ్బు అంటూ కొమ్ము కాస్తూ బలిసిపోయిన మండలలో కొందరు విలేకరులు,ఇంత జరిగిన ఏమీ తెలియనట్టు వార్త వ్రాయకపోవడం విచిత్రదాయకం అని ప్రజలు అవేదన వ్యక్తం చేరు.