విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:
మోతుగూడెం గ్రామంలో వినాయకుని గుడి దగ్గర ఉన్న కల్వర్టు రెండు చోట్ల దెబ్బతింది. సిమెంట్ పెచ్చులూడి,ఇనుప ఊచలు కనిపిస్తున్నాయి.ఇది నాలుగు రోడ్లు కూడలి కావడంతో ఒక మార్గం అంగన్వాడీ స్కూల్ కి, మరో రెండు మార్గాలలో మార్కెట్ సెంటర్, డి. ఏ. వి స్కూల్ కి ,మరో మార్గం సుమారు నాలుగు కిలోమీటర్ల దూరాన కొండల నడుమ ఉన్న నేలకోట అనే చిన్న గ్రామానికి, రోడ్డు మార్గం లేక అక్కడ నివసిస్తున్న వాళ్ళు,వాగులు దాటి కాలినడకన నిత్యావసర సరుకులు, వైద్యం కోసం రేయింబవళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి వస్తారు. కల్వర్టు మీద వెళ్లే వాహనదారులు, పాదచారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.ప్రమాదాలు జరగకుండా స్థానికులు తాత్కాలికంగా ఇదివరకు కల్వర్టుపై గుంతలు ఉన్న చోట,చెత్త వేయడానికి ఉపయోగించే సిమెంట్ తూరలు అడ్డుపెట్టారు..ఇవి పెట్టినా ఫలితం లేదు..నాలుగు రోడ్ల కూడలి కావడంతో వాహనాలు మలుపు తిరిగే సమయంలో ఆ సిమెంట్ తూరలకు తగిలి వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి.చుట్టుపక్కల వాళ్ళు మరలా సిమెంట్ తూరలు తొలగించి, ఆ గుంతలను మట్టితో నింపారు.కల్వర్టు ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం వుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కల్వర్టు మరమ్మత్తులుతో పాటు, స్పీడ్ బ్రేకర్,స్కూల్ జోన్ బోర్డు ఏర్పాటు చేయాలని వాహనదారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మోతుగూడెం ప్రజానీకం కోరుకుంటున్నారు…