విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగు నివారణ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలని ఎంపీపీ నౌడు వెంకటరమణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శుక్రవారం వైద్యాధికారిణి అంగర దేవి రాజశ్రీ ఆధ్వర్యంలో నులుపురుగు నివారణ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగు నివారణ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలన్నారు. వైద్యాధికారిణి దేవి రాజశ్రీ మాట్లాడుతూ ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లల వరకు ఆల్బ్ండజోల్ మాత్రలు వేయాలన్నారు. ఈ మాత్రలను అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోనూ అంగన్వాడి సెంటర్లలో ఉన్న పిల్లలందరికీ టీచర్ల సమక్షంలో ఈ మాత్రలు వేస్తారన్నారు. నులుపురుగు వల్ల పిల్లలలో రక్తహీనత, శారీరక మానసిక ఎదుగుదల తగ్గిపోతాయన్నారు. పిల్లలందరికీ నిలుపరుగు నివారణ మందును తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. దీనికి పాఠశాలల ఉపాధ్యాయులు అంతా పూర్తిగా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మాత్రల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఒకవేళ కడుపునొప్పి వికారం వంటివి ఉన్నా కొద్ది సేపట్లో అవి తగ్గిపోతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం ఎంపీపీ వెంకటరమణ, ఎండిఓ, డి శ్రీనివాస్ చేతుల మీదుగా వివిధ ఆరోగ్య కేంద్రాలకు,పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ డి కృష్ణ శేఖర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వాణి కుమార్ ఆరోగ్య కేంద్ర పరిధిలోని అన్ని సచివాలయాల ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, వివిధ పాఠశాలలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.