విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రాపురం:
సోమవారం 13వ తారీఖున రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో ప్రజా విజ్ఞాపన స్వీకరణ కార్యక్రమం *స్పందన* డివిజన్ స్థాయిలో జరుగుతుందని రామచంద్రపురం ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యం తెలియజేశారు. కావున డివిజనల్ స్థాయి అన్ని శాఖల అధికారులు అందరూ ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆమె ఆదేశించారు.
అదేవిధంగా మండల స్థాయిలో నిర్వహించే *స్పందన* కార్యక్రమమునకు మండల స్థాయి అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె ఆదేశించారు.