లెనోర డెంటల్ కాలేజీ రాజానగరం వారి ఆధ్వర్యంలో పెంటపల్లి గ్రామంలో ఎంపీపీ యూపీ స్కూల్లో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు చేసి వారికి కావలసిన మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.


