ePaper
Tuesday, September 22, 2026
ePaper
Homeఎడిటోరియల్.ద్రాక్షారామలో ఉచిత వైద్య శిబిరం.. గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

.ద్రాక్షారామలో ఉచిత వైద్య శిబిరం.. గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

  • ద్రాక్షారామం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ పిల్లి సూర్యప్రకాష్  మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.ఆలయానికి ఎంత ఆదాయం ఉంది, ఇప్పటివరకు ఆలయ నిర్వహణ ఎలా కొనసాగింది అనే పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని కోరారు.2022లోనే అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖకు అప్పగించే ప్రక్రియకు సంబంధించిన ప్రొసీడింగ్ జారీ అయిందని తెలిపారు. ఇది జీవో కాదని, సంబంధిత దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ద్వారా జారీ చేసిన ప్రొసీడింగ్ అని స్పష్టం చేశారు.అలాగే, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సుమారు 65 దేవాలయాలకు సంబంధించి 2022లో ధూప దీప నైవేద్య పథకానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయని పేర్కొన్నారు. ఆదాయం లేని లేదా తక్కువ ఆదాయం ఉన్న చిన్న దేవాలయాల్లో నిత్య పూజలు కొనసాగించేందుకు ఈ పథకం ఉద్దేశించబడిందని వివరించారు.ధూప దీప నైవేద్య పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభమైందని, అనంతరం వివిధ ప్రభుత్వాల కాలంలో కొనసాగుతూ వచ్చిందని తెలిపారు. 2024లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయాన్ని నెలకు రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారని పేర్కొన్నారు.ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే పరిపాలనా ప్రక్రియ ఒక అంశం కాగా, ధూప దీప నైవేద్య పథకం మరో అంశమని పిల్లి సూర్యప్రకాష్ గారు మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.ఈ రెండు అంశాలను కలిపి ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ప్రచారం చేయడం సరికాదని అన్నారు. 2022లో జారీ చేసిన ప్రొసీడింగ్, ఆలయ ఆదాయం, ఆలయ నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.ఆలయాల విషయంలో భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, వాస్తవాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని పిల్లి సూర్యప్రకాష్ కోరారు. అలాగే పెమ్మిరెడ్డి మురళి,తెలగని సూర్య ప్రకాష్, మీడియా తో మాట్లాడారు,ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img