మండలం (రాయవరం), East Godavari (VISWAM VOICE DESK):
జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి ఎంపిక
మండల కేంద్రమైన రాయవరం లోని శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్, నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల గొల్లలమామిడాడ జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో నిర్వహించిన అండర్–19 విభాగం ఎంపిక పోటీల్లో రాయవరం పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జి. అలేఖ్య వాలీబాల్‌కు, 10వ తరగతి విద్యార్థి టి. యశ్వంత్ కుమార్ రెడ్డి నెట్‌బాల్‌కు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, విద్యార్థులకు శిక్షణ అందించిన పీడీలు సీహెచ్. అజ్జిబాబు, కే. శ్రీనివాసులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విప్పర్తి శాంతి సునీత అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి పత్తి రామలక్ష్మణమూర్తి, మండల విద్యాశాఖ అధికారి రాంబాబు, స్కూల్ చైర్మన్ పట్నాల జగదీష్, ఎంపీటీసీ, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి రాష్ట్రస్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.

