విశ్వంవాయిస్ న్యూస్, కాట్రేనికోన మండలం:
సముద్రపు ఇసుక ను ట్రాక్టర్ల తో వంతెన పై తరలించడం వల్ల దిగబడిన పల్లం వంతెన
మత్స్యకారుల రాకపోకలకు గోదారిపై ఒక్కటే వంతెన
ఆందోళనలో మత్స్యకార గ్రామస్తులు
కాట్రేనికోన విశ్వం వాయిస్ న్యూస్ ఏప్రిల్ 16
మండలంలోని మత్స్యకార గ్రామాల్లో ఒకటైన పల్లం గ్రామానికి చేరుకోవాలంటే ఉన్న ఒక్క వంతెన దిగుబడిపోయింది సముద్రపు ఇసుకను రాత్రి వేళలో ట్రాక్టర్ల ద్వారా తరలించడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పలువురు గ్రామస్తులు పేర్కొంటున్నారు పల్లం గ్రామ సమీపంలో సుమారు నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించే వాటర్ ప్రాజెక్ట్ కు అవసరమైన ఇసుకను తరలించే క్రమంలో వంతెన ర్యాంపు వద్ద కుంగిపోయింది దీంతో హడావుడిగా మెటల్ చిప్స్ ను దిగబోసి కవర్ చేశారు గ్రామస్తులు బాహ్య ప్రపంచానికి రావాలంటే ఈ వంతెన దాటి రావాలి. ఈ క్రమంలో నీళ్ల రేవు గ్రామస్తులుభయాందోళనలకు గురవుతున్నారు తక్షణం మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు